అశోక్ గజపతిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీటర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ''అశోక్ గజపతిరాజు వంశీకులు కట్టించిన ఆలయాల ముందు కొబ్బరిచిప్పలు కొట్టేసే దొంగకి మహారాజు ఔన్నత్యం ఎలా తెలుస్తుంది. నీతికి, బూతుకు తేడా తెలియని వారి నోటి నుంచి అంతకంటే మంచి భాష ఎలా వస్తుంది" అంటూ లోకేశ్ మండిపడ్డారు.
రామతీర్థం ఆలయం కట్టించిన అశోక్‌గజపతిరాజు పూర్వీకులు..ఆలయ ధూపదీప నైవేద్యాలకు తమ ఏలుబడిలోని 12 గ్రామాలను కేటాయించారని లోకేశ్ గుర్తు చేశారు. విజయనగరం సంస్థానంలో 105 దేవాలయాల నిర్మాణం, పోషణ పూసపాటి వంశీకులదేనన్న విషయం కూడా దేవాదాయ శాఖ మంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. మాన్సాస్ ట్రస్టు ద్వారా 14కి పైగా విద్యాసంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులేనని మంత్రి వెల్లంపల్లి తెలుసుకోవాలని హితవు పలికారు.
ఇదీచదవండి