విశాలాంధ్ర సంపాదకులు ముత్యాలప్రసాద్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం ప్రకటించారు. ఎంతో నిబద్ధతతో పనిచేసిన ముత్యాల ప్రసాద్ మృతి పత్రికారంగానికి తీరని లోటని కీర్తించారు. వామపక్షనేతగా సమాజం పట్ల తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఇదీచదవండి