విజయవాడ ధర్నా చౌక్‌లో లైసెన్స్డ్ సర్వేయర్లు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. గ్రామ సచివాలయాల్లో నియమించే సర్వే అసిస్టెంట్ పోస్టులకు...మండల కార్యాలయాల్లో పని చేస్తున్న లైసెన్సుడ్ సర్వేయర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెం.800 ప్రకారం సర్వే శాఖ ద్వారా శిక్షణ పొందినవారిని.. ఆ శాఖ నిర్వహించిన పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించిన సర్వేయర్లను గ్రామ సచివాలయాల్లోని సంబంధిత పోస్టుల్లో నియమించాలని ముత్యం గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
ఇదీ చదవండి :