తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను నందమూరి కుటుంబ సభ్యులు ఖండించారు. వైకాపా నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్న..కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి వ్యక్తిత్వ హననం సరికాదన్నారు. తాను తన సోదరి భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగామన్నారు. విలువల్లో రాజీ ప్రస్తకే లేదని పునరుద్ఘాటించారు.
వ్యక్తిగత దూషణలు బాధాకరం..
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని..,వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని నందమూరి సుహాసిని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేయడం తగదన్నారు. తెలుగు ప్రజలందరూ చంద్రబాబు వెంటే ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.
మహిళ వ్యక్తిత్వంపై వ్యాఖ్యలను ఖండిస్తున్నా..
మహిళ వ్యక్తిత్వంపై వైకాపా వ్యాఖ్యలను ఖండిస్తున్నానని రాజ్యసభ సభ్యడు సీఎం రమేశ్ అన్నారు. వైకాపా నేతల దిగజారుడు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు.
ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత బాధాకరం..
వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని ట్వీటర్ వేదికగా వెల్లడించారు.
కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగడం దారుణం. రాష్ట్రంలో రాజకీయ నాయకుల ప్రవర్తన అసహ్యం కలిగిస్తోంది. ఇకనైనా నీచ రాజకీయాలకు స్వస్తి పలకండి..లేకపోతే ప్రజలు క్షమించరు. జీవీఎల్ నరసింహారావు, భాజపా ఎంపీ
ఇదీ చదవండి