అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో ముస్లిం పరిరక్షణ సమితి నేతలు చలో నంద్యాలకు బయలుదేరారు. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి పేరిట ఐకాస ఏర్పాటు చేసిన వారు... విజయవాడ మదీనా మసీద్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసిన అనంతరం బస్సులో నంద్యాల చేరుకున్నారు.
ఎలాంటి పోరాటానికైనా సిద్ధం
చలో నంద్యాల కార్యక్రమానికి అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సలాం ఘటనలో పోలీసులు కూడా భాగస్వామ్యులుగా ఉండటం బాధాకరమన్నారు. సెల్ఫీ వీడియో బయటకు రాకుంటే నిజాలు బయటకు వచ్చేవి కాదని... ఎవరి ఓట్లతో అయితే జగన్ గెలిచారో వారి పైనే దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటున్నారని... తగిన సమయంలో బుద్ది చెబుతారని హెచ్చరించారు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎలాంటి పోరాటానికైనా సీపీఐ మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలి
సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు బాధ్యులైన పోలీసులను, పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చిన అధికారపార్టీ నేతలను కఠినంగా శిక్షించాలని తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా డిమాండ్ చేశారు. బెయిల్ బుల్ సెక్షన్లు పెడితే ఏ కోర్టు అయినా బెయిల్ ఇస్తుందనే ఇంగితం మరిచారా అంటూ మండిపడ్డారు. సెక్షన్లు ఏ కేసులో ఎలా పెట్టాలో కూడా తెలియడం లేదా అని ధ్వజమెత్తారు. సీబీఐ విచారణతోనే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: