council meeting: విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రగడ నెలకొంది. ప్రజా సమస్యల అంశాలను అజెండాలో పెట్టకపోవడంపై తెదేపా కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. కౌన్సిల్లో సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. నగర సమస్యలపై తెదేపా కార్పొరేటర్లు ప్రశ్నించే క్రమంలో వాగ్వాదం జరిగింది. ప్రజా సమస్యలపై చర్చించకుండా కౌన్సిల్ సమావేశం నిర్వహించవద్దని తెదేపా, సీపీఎం కార్పొరేటర్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: