ETV Bharat / city

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఆ జిల్లాలో దడపుట్టించిన వడగళ్ల వాన - ఏపీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో తలెత్తిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముందని... అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్రవాయుగుండం ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

చిరు జల్లులతో వరుణుడు
చిరు జల్లులతో వరుణుడు
author img

By

Published : Mar 21, 2022, 8:12 PM IST

Updated : Mar 22, 2022, 5:10 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో తలెత్తిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. తర్వాత 12 గంటల్లో తుపాను అండమాన్‌ దీవుల వెంట ఉత్తరం వైపు కదులుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. బుధవారం రోజు తాండ్వే (మయన్మార్‌) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీవ్రవాయుగుండం ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో 65.5 మి.మీ., విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో 38.75, ప్రకాశం జిల్లా కనిగిరిలో 37, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో 35 మి.మీ వర్షపాతం నమోదైంది.

విశాఖ మన్యంలో వడగళ్లు...

విశాఖ మన్యంలో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. నర్సీపట్నం, పాడేరు, కొయ్యూరు, హుకుంపేట, కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులతో వడగళ్లు పడ్డాయి. తోటలు, పంటపొలాలు దెబ్బతిన్నాయి. పలుగ్రామాల్లో రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. విద్యుత్తు తీగలపై చెట్లకొమ్మలు విరిగిపడటంతో సరఫరా నిలిచింది.

.

ఇదీ చదవండి

అప్పుడు పెగాసస్‌ కొనలేదు.. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: ఏబీవీ

Last Updated : Mar 22, 2022, 5:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.