రాష్ట్రంలో కొత్తగా 7,796 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 89,732 శాంపిల్స్ పరీక్షించగా, 7,796 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా 14,641మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,07,588 యాక్టివ్ కేసులు ఉండగా.., గడిచిన 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 77మంది మృత్యువాతపడ్డారు.
అత్యధికంగా చిత్తూరులో 12 మంది చనిపోగా, పశ్చిమగోదావరి 10, అనంతపురం 8, నెల్లూరు 8, శ్రీకాకుళం 7, తూర్పుగోదావరి 6, విశాఖ 6, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, కర్నూలు 3, కడపలో 2 ప్రాణాలు విడిచారు.
ఇదీ చదవండి