ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు దాదాపు 70 శాతం పూర్తయిందని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని కేంద్రం పెద్దలే ఒప్పుకున్నారని లంకా దినకర్ గుర్తు చేశారు. ఎన్నికల్లోపు పోలవరం పూర్తికాకూడదని... కావాలనే డీపీఆర్ పంపిస్తే జాప్యం చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఆపేందుకు తెరాస నేతలు కేసులు వేశారన్న లంకా దినకర్...ప్రాజెక్టులు అడ్డుకుంటున్న కేసీఆర్‌కు జగన్ మద్దతు ఇస్తారా అని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే చంద్రబాబుకు మంచిపేరు వస్తుందని భాజపా, వైకాపా, తెరాస కలిసి అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు ఉన్నారని లంకా దినకర్ స్పష్టం చేశారు...
ఇవీ చదవండి
'బలహీనవర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి.. జగ్జీవన్ రాం'