ETV Bharat / city

సాంకేతిక అనుమతులు లేనివన్నీ.. కొత్తవే: కృష్ణా బోర్డు - కృష్ణా బోర్డు తాజా నిర్ణయాలు న్యూస్

కృష్ణాబేసిన్‌లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్‌)లు అందజేయాలని కృష్ణా నదీ యాజమాన్యబోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది. ఈ డీపీఆర్‌లను కృష్ణాబోర్డు, జలసంఘం పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ మంజూరు చేయాలని పేర్కొంది. తమ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేస్తామని రెండు రాష్ట్రాల అధికారులు హామీ ఇచ్చినట్లు బోర్డు ప్రకటించింది. శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్తును రెండు రాష్ట్రాలు 50 శాతం చొప్పున వాడుకునేలా నిర్ణయించారు.

Krishna River Management Board on water disputes

author img

By

Published : Jun 5, 2020, 4:58 AM IST

హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్యబోర్డు 12వ సమావేశం వాడీవేడిగా సాగింది. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య గట్టి వాదనలు జరిగాయి. బోర్డు ఛైర్మన్‌ పరమేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు నారాయణరెడ్డి, మురళీధర్‌, బోర్డు అధికారులు, రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు. గత ఏడాదిలాగానే ఆంధ్రప్రదేశ్‌ 66 శాతం, తెలంగాణ 34 శాతం నీటిని వినియోగించుకునేలా సమావేశంలో నిర్ణయించారు.

2019-20వ సంవత్సరం కేటాయించి వాడుకోలేని నీటిని 2020-21వ సంవత్సరంలో వినియోగించుకోవడానికి అనుమతించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించలేదు. నాగార్జునసాగర్‌ నుంచి తాగడానికి తీసుకునే నీటిలో 20 శాతాన్నే లెక్కల్లోకి తీసుకోవాలని, గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే నీటిలో నాగార్జునసాగర్‌ ఎగువన వాడుకోవడానికి ఉన్న 45 టీఎంసీలను, పట్టిసీమ ద్వారా మళ్లించే నీటిలో 45 టీఎంసీలను ఇవ్వాలని కోరింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో తెలంగాణకు 299కి బదులు 389 టీఎంసీలు ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన 512 టీఎంసీలలో 80 టీఎంసీలు తగ్గించాలని తెలంగాణ కోరగా, వీటన్నింటిపై కూలంకుషంగా చర్చించారు. ఇవన్నీ కేంద్రజల్‌శక్తి , కేంద్రజలసంఘం పరిధిలో ఉన్నందున కేంద్ర నిర్ణయానికి వదిలిపెట్టారు.

  • టెలిమెట్రీకి ప్రాధాన్యం

చిన్ననీటి వనరుల వినియోగం, గోదావరి నుంచి మళ్లించే నీటిలో వాటా విషయం తేలేవరకు ఇప్పటివరకు వినియోగించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ 66శాతం, తెలంగాణ 34 శాతం వాటాకే అంగీకారం కుదిరింది. బోర్డు విడుదల చేసిన ప్రకటన ప్రకారం సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

* టెలిమెట్రీ రెండో దశను ప్రాధాన్యంగా భావించి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను బోర్డుకు ఇవ్వడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.

* అన్ని డ్యాములు నిండి నీటిని కిందికి వదిలే సమయంలో తీసుకునే వరద నీటిని లెక్కల నుంచి మినహాయించాలన్నదానిపై చర్చ జరిగింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం నియమించిన కమిటీ నివేదిక ఇచ్చే వరకు 2019-20 సంవత్సరంలోని మిగులు జలాలను చెరి యాభైశాతం పంచుకునేలా అంగీకరించారు.

* కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి తరలించడంపై చర్చించారు. ఈ అంశాన్ని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయానికి వదిలిపెట్టాలని తీర్మానించారు.

  • కొత్తగా ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు : తెలంగాణ

తాము కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదని తెలంగాణ పేర్కొంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులు వచ్చాయని, ఇప్పటికే రూ.12వేల కోట్లు ఖర్చుచేశామని, ప్రధానమంత్రి ప్రసంగంలో కూడా ఈ ప్రాజెక్టును ప్రస్తావించారని సమావేశం దృష్టికి తెలంగాణ తెచ్చింది. దీనికి అంగీకరించని ఆంధ్రప్రదేశ్‌ ఇవన్నీ కొత్త ప్రాజెక్టులేనని, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో కూడా లేవని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టులపై వాదోపవాదాలు, సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేయాలని, తాము సూచించినట్లుగా ఈ ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని బోర్డు ఛైర్మన్‌ రెండు రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

  • ముచ్చుమర్రి లాంటివి 2014కు ముందే చేపట్టాం: ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ ఎత్తిపోతలతో సహా 15 ప్రాజెక్టులను కొత్తగా చేపట్టినట్లు తెలంగాణ ఫిర్యాదు చేయగా, తెలంగాణ పాలమూరు-రంగారెడ్డితో సహా ఐదు కొత్త పథకాలు చేపట్టిందని, మూడింటి సామర్థ్యాన్ని పెంచినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టులన్నింటిపైనా బోర్డు సమావేశంలో చర్చించారు. ముచ్చుమర్రి లాంటి ఎత్తిపోతల పథకాలు 2014కు ముందు చేపట్టినవని, అసలు తాము చేపట్డడానికి ఉత్తర్వులివ్వని ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయని, 2014 తర్వాత ఉత్తర్వులిచ్చిన ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను ప్రభుత్వంతో చర్చించి అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొన్నట్లు తెలిసింది.

  • కేంద్ర ఆదేశాలను అందించాం

సాంకేతిక అనుమతులు లేకుండా నిర్మిస్తున్నవన్నీ కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తాం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదుల మేరకు ఆయా రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలు సమర్పించాలని సూచించాం. అంత వరకు కొత్తపనులేవీ చేపట్టవద్దని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను అందించాం. డీపీఆర్‌లు సమర్పిస్తే కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులను పరిశీలిస్తాం. హైడ్రాలజీ, డిజైన్లు, అంతర్రాష్ట్ర సమస్యలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.

- పరమేశం, ఛైర్మన్‌, కృష్ణానదీ యాజమాన్య బోర్డు

  • తెలంగాణ వాదనలు వినిపించాం

బోర్డు సమావేశంలో తెలంగాణ వాదనలు పూర్తిస్థాయిలో వినిపించాం. పోలవరం-పట్టిసీమ గోదావరి జలాల మళ్లింపులో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను అడిగాం. కృష్ణా జలాల్లో హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 20 శాతంగా (16.5 టీఎంసీలు) లెక్కించాలని సూచించాం. ఇంతకు ముందే ఉన్న అవార్డు ప్రకారం నీటిని ఇవ్వాలని కోరాం.

- రజత్‌కుమార్‌, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.