ETV Bharat / city

ధాన్యం కొని డబ్బు ఇవ్వట్లేదని రైస్​ మిల్లర్​పై ఫిర్యాదు - రైతులు

కృష్ణా జిల్లా ఎనికేపాడుకు చెందిన ఓ రైస్ మిల్లు యజామనికి రెండేళ్ల క్రితం రైతులు ధాన్యాన్ని విక్రయించారు. అయితే ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. దాంతో విజయవాడ పటమట పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.

krishna
రైస్​ మిల్లర్​పై ఫిర్యాదు
author img

By

Published : Jul 15, 2021, 10:23 AM IST

ధాన్యాన్ని అమ్మి రెండేళ్లైనా రైస్​ మిల్లు యజమాని ఇంతరవరకు డబ్బు చెల్లించలేదంటూ రైతులు, ధాన్యం వ్యాపారి.. విజయవాడ పటమట పోలీసులను ఆశ్రయించారు. గోదం బాల వెంకటేశ్వరరావు అనే వ్యాపారి రెండేళ్ల క్రితం కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడుకు చెందిన పల్లవి రైస్‌మిల్లు యజమాని విశ్వనాథానికి ధాన్యాన్ని విక్రయించాడు.

అయితే పంపిణీ చేసిన ధ్యానానికి నగదు చెల్లించుకుండా కాలయాపన చేస్తుండటంతో వ్యాపారి పలువురు రైతులతో స్టేషన్‌కు వచ్చారు. తమకు చెల్లించాల్సిన 1.90 కోట్లు నగదు బకాయిలను చెల్లించకుండా వాయిదా వేస్తున్నాడని పోలీసులకు తెలిపారు. బకాయిలు కోట్లలో ఉండడం, బాధితులంతా రైతులు కావడంతో సీఐ.. రైతులను, దళారులను సెంట్రల్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లమని చెప్పారు. ఇదే విషయంపై గత సోమవారం జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో మిల్లు యజమాని విశ్వనాథంపై 80 మంది రైతులు, దళారీలు 3.5 కోట్లు చెల్లించాలని ఫిర్యాదు చేశారు. నిందితుడిని జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనే సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్‌ ఇంతియాజ్‌కు వారెంట్‌ జారీ

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.