విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో మార్చి 31 వరకు 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయన్న కలెక్టర్.... జిల్లాలో నలుగురైదుగురు ఎక్కడ గుమిగూడరాదని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : కరోనాపై కరతాళం... చేయి కలిపిన ప్రముఖులు