ETV Bharat / city

మోకా హత్యకేసు: మచిలీపట్నం సబ్​జైలుకు కొల్లు రవీంద్ర

వైకాపా నేత మోకా భాస్కరరావు హత్యకేసులో మచిలీపట్నం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం మచిలీపట్నం సబ్​జైలుకు రవీంద్రను తరలించారు.

kollu-ravindra-to-be-sent-to-machilipatnam-sub-jail-in-moka-murder-case
మచిలీపట్నం సబ్​జైలుకు కొల్లు రవీంద్ర
author img

By

Published : Jul 4, 2020, 7:56 PM IST

వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు మచిలీపట్నం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్​ ఆయనకు 14 రోజుల రిమాండ్​ విధించారు. అనంతరం కృష్ణా జిల్లా మచిలీపట్నం సబ్​జైలుకు రవీంద్రను తరలించారు. అనుమతి రాగానే రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. రాత్రి అరెస్టు చేసిన మరో ఇద్దరు నిందితులను సబ్ జైలుకు తరలించారు.

మచిలీపట్నం సబ్​జైలుకు కొల్లు రవీంద్ర

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు...

తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం రాత్రి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు అత్యంత గోప్యంగా వ్యవహరించారు. చివరకు పెడన నియోజకవర్గంలోని గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొల్లు రవీంద్రకు కరోనా, ఇతర వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా హత్య: ఎస్పీ

తెదేపా నేత కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మచిలీపట్నంలో వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్య జరిగిందని కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు చెప్పారు. హత్యకు 5 రోజుల ముందు ప్రధాన నిందితుడితో కొల్లు రవీంద్ర భేటీ అయ్యారని వివరించారు. హత్యకు ముందు, తర్వాత కూడా ప్రధాన నిందితుడు మాజీమంత్రితో మాట్లాడారని తెలిపారు.

ఇవీ చదవండి: 'భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర హస్తం.. ఆధారాలున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.