ETV Bharat / city

కేఎల్​ యూనివర్సిటీ వీసీ ఎస్​ఎస్​.రెడ్డి కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత కేఎల్​ యూనివర్సిటీ వీసీ ఎస్​ఎస్​.రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అకాల మృతి పట్ల సంస్థ యాజమాన్యం, ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు.

author img

By

Published : Apr 27, 2021, 5:19 PM IST

Updated : Apr 27, 2021, 5:29 PM IST

klu vc died of heart attack
కేఎల్​ యూనివర్సిటీ వీసీ ఎస్​ఎస్​.రెడ్డి కన్నుమూత

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్​ డీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఎస్​ఎస్​.రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కేఎల్​ యూనివర్సిటీలో వివిధ హోదాల్లో డాక్టర్ ఎస్​ఎస్​. రెడ్డి పనిచేశారు. విద్యా సంస్థకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా, NAAC - A++ తో పాటు రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిల్లో ప్రతిష్ఠాత్మక అవార్డులు, గుర్తింపులు రావటంలో కీలక పాత్ర పోషించారు. వీసీ వీసీ ఎస్​ఎస్​.రెడ్డి మృతి పట్ల కోనేరు లక్ష్మయ్య విద్యా సంస్థ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, ఇతర అధ్యాపకులు సంతాపం ప్రకటించారు.

ఇవీ చదవండి:

'సంకల్పానికి ,సమయస్ఫూర్తికి సంకేతం హనుమంతుడు'

Last Updated : Apr 27, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.