ETV Bharat / city

నూతన వంగడాలు తక్కువ ధరకు అందాలి: రైతులు

author img

By

Published : Mar 2, 2021, 7:31 PM IST

కృష్ణా జిల్లా ఘంటశాలలోని ఆచార్య ఎన్.జి. రంగా విశ్వవిద్యాలయం పరిశోధనా స్థానంలో కిసాన్ మేళా నిర్వహించారు. దానికి కర్షకులు పెద్దఎత్తున హాజరయ్యారు. వరి, మినుము, పెసర పంటల్లో నూతన వంగడాలు, పురుగు మందులు, ఎరువులపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తల సాయంతో మంచి ఫలితాలు సాధించిన రైతులు తమ అనుభవాలు వివరించారు. శాస్త్రవేత్తలు రూపొందించే నూతన వంగడాలు ప్రతి రైతుకు తక్కువ ధరకు అందేలా చర్యలు తీసుకోవాలని కర్షకులు కోరుతున్నారు.

kisan mela
కిసాన్ మేళా
కిసాన్ మేళా

కొత్త వంగడాల సృష్టిలో శాస్త్రవేత్తల కృషి.. రైతులందరికీ చేరువయ్యేలా చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూతన వంగడాలు అందిపుచ్చుకున్న రైతులు... ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. వ్యవసాయ కేంద్రాల నుంచి విత్తనాల మినీ కిట్‌లు అందరికీ లభ్యమయ్యేలా చూడాలని కోరుతున్నారు.

మంచి ఫలితాలు సాధించిన రైతులు..

రైతుల్లో అవగాహన పెంచే రీతిలో.... కృష్ణా జిల్లా ఘంటశాలలోని ఆచార్య ఎన్.జి. రంగా విశ్వవిద్యాలయం పరిశోధనా స్థానంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకు కర్షకులు పెద్దఎత్తున హాజరయ్యారు. వరి, మినుము, పెసర పంటల్లో నూతన వంగడాలు, పురుగు మందులు, ఎరువులపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల సాయంతో మంచి ఫలితాలు సాధించిన రైతులు తమ అనుభవాలు వివరించారు.

kisan mela
కిసాన్ మేళా

మినీకిట్ల రూపంలో వంగడాలు..

తెగుళ్లు, పురుగులను తట్టుకొని అధిక దిగుబడులు సాధించే వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించి ఎంపిక చేసిన రైతులకు మినీకిట్ల రూపంలో అందిస్తున్నారు. వాటి ద్వారా విత్తనాలు తయారుచేసి అధిక ధరలకు అమ్ముతుండటం వలన అందరికీ కొత్తరకాలు చేరువ కావడం లేదని రైతులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు రూపొందించే నూతన వంగడాలు ప్రతి రైతుకు తక్కువ ధరకు అందేలా చర్యలు తీసుకోవాలని కర్షకులు కోరుతున్నారు.

ప్రతి ఏడాది కిసాన్ మేళా..

వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికను రైతులకు చేరువ చేయడంలో కిసాన్ మేళా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఏడాది కిసాన్ మేళా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై.. వరి , మినుము, పెసలులో నూతన వంగడాలు, పురుగుల మందులు, ఎరువులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. -డా.కె.నాగేంద్రరావు, శాస్త్రవేత్త

విత్తనాలు అందడం లేదు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. ఏపీలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు..కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఎంతో మంది రైతులకు నూతన వంగడాలపై అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన వంగాడాలు రూపొందిస్తున్నారు. తెగుల్లు, పురుగులు తట్టుకుని అధిక దిగుబడులు సాదించే వంగడాలు రూపొందించి ఎంపిక చేసిన కొద్ది మంది రైతులకు మినికిట్​ల రూపంలో అందిస్తున్నారు. కానీ ఆ రైతులు మినికిట్​ల విత్తనాలు సాగుచేసి.. వచ్చిన విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులందరికి నాణ్యమైన విత్తనాలు అందడం లేదు. - రైతులు.

ఇదీ చదవండి: వర్సిటీలకు ప్రవేశ పరీక్షల బాధ్యతలు అప్పగింత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.