ETV Bharat / city

జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు - అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సహా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కొంత ముందడుగు పడింది. పాత కొత్త ప్రాజెక్టులపై... కేంద్రం స్పష్టత ఇచ్చింది. కొత్త వాటి డీపీఆర్‌లు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. రాష్ట్రాల నుంచి అభ్యంతరాలున్నా బోర్డుల పరిధిని నిర్ణయించనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ప్రధాన ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి, గోదావరిపై ప్రాజెక్టులు గోదావరి బోర్డు పరిధిలోకి వస్తాయి. అంతర్ జలవివాద చట్టం 1956 సెక్షన్-3 ప్రకారం విచారణ తమ ఫిర్యాదును ట్రైబ్యునల్​కు పంపాలన్న తెలంగాణ రాండ్ పరిశీలనకు కేంద్రం అంగీకరించింది. ఇందుకోసం సుప్రీంకోర్టులో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్​ను ముందుగా ఉపసంహరించుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించారు.

జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు

author img

By

Published : Oct 7, 2020, 5:42 AM IST

Updated : Oct 7, 2020, 6:44 AM IST

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సహా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఎట్టకేలకు కొంత ముందడుగు పడింది. పాత, కొత్త ప్రాజెక్టుల గురించి కేంద్రం స్పష్టత ఇచ్చింది. కొత్తవాటి డీపీఆర్‌లు ఇవ్వాల్సిందేనని పేర్కొంది. రాష్ట్రాల నుంచి అభ్యంతరాలున్నా బోర్డుల పరిధిని నిర్ణయించనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా ప్రధాన ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి, గోదావరిపై ప్రాజెక్టులు గోదావరి బోర్డు పరిధిలోకి వస్తాయి. అంతర్‌ రాష్ట్ర జలవివాద చట్టం 1956లోని సెక్షన్‌-3 ప్రకారం విచారణ కోసం తమ ఫిర్యాదును ట్రైబ్యునల్‌కు పంపాలన్న తెలంగాణ డిమాండ్‌ పరిశీలనకు కేంద్రం అంగీకరించింది. ఇందుకోసం సుప్రీంకోర్టులో ఉన్న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను ముందుగా ఉపసంహరించుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మంగళవారం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు 2014లో కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటయ్యాయి. నీటి కేటాయింపులపై విచారణ జరుపుతున్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపకుండా బోర్డుల పరిధిని నోటిఫై చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలంగాణ అభ్యంతరం చెబుతూ వచ్చింది. కౌన్సిల్‌ సమావేశంలోనూ ఇదే స్పష్టం చేసింది. అయితే బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపుల ప్రకారం నీటి వినియోగాన్ని పర్యవేక్షించడానికి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తామని, కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-2 తీర్పు వచ్చాక బోర్డుల పరిధి, విధులు దానికి తగ్గట్లుగా మారతాయని కేంద్రం పేర్కొంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు గోదావరి బోర్డు కార్యాలయం హైదరాబాద్‌లో, కృష్ణా బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలి. కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌కు మార్చడానికి అంగీకారం కుదిరింది.

రాయలసీమ, పాలమూరు కొత్తవే!

ఏవి కొత్త ప్రాజెక్టులన్నదానిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. దీని ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రెండూ కొత్తవిగానే పరిగణించే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవే కాబట్టి వీటికి డీపీఆర్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్రాలు వాదించాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులు, లేదా పునర్విభజన చట్టం షెడ్యూలు-11లో ఉన్నవే పాతవని కేంద్రం పేర్కొంది. వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగొండ ఉన్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌.ఎల్‌.బి.సి.) పొరపాటున రాలేదని, దానిని కలపాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కేంద్రానికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోతే ప్రస్తుతం వాదనలు వింటున్న కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-2 నుంచి నీటి కేటాయింపులు పొందాలని కేంద్రం పేర్కొంది. ట్రైబ్యునళ్ల నుంచి నీటి కేటాయింపులు లేకుండా రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల పరిధిని మార్చి ఉంటే వాటి డీపీఆర్‌లను సమర్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్తవన్నట్లే. వాటి డీపీఆర్‌లను సమర్పించాల్సి ఉంటుంది. కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల డీపీఆర్‌లను ఇవ్వాల్సి ఉంటుంది. సాంకేతికంగా అనుమతిచ్చే వరకు కొత్త ప్రాజెక్టుల పనులను చేపట్టకూడదని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

గోదావరి ట్రైబ్యునల్‌

గోదావరి జలాల పంపిణీ విషయంలో కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,430 టీఎంసీలు ఉన్నాయి. 2014 ఫిబ్రవరిలో ఉమ్మడి ఏపీ శాసనసభలో గోదావరిలో 1,486.155 టీఎంసీల నీటి లభ్యత ఉందని పేర్కొంటూ తెలంగాణకు 967.94, ఆంధ్రప్రదేశ్‌కు 518.1.215 టీఎంసీలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈనెల 2న తెలంగాణ ముఖ్యమంత్రి రాసిన లేఖలోనూ అదే విషయాన్ని ప్రస్తావించారు. గోదావరి జలాలపై చర్చ తర్వాత కొత్త ట్రైబ్యునల్‌ వైపే రెండు రాష్ట్రాలు మొగ్గు చూపాయి. పోలవరం ద్వారా గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో 45 టీఎంసీల వాటా గురించి కేసీఆర్‌ మాట్లాడగా, తెలంగాణలో 214 టీఎంసీలకు పైగా గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లిస్తున్నారని, అందులో వాటా ఇవ్వండని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నట్లు తెలిసింది.

రెండు రాష్ట్రాలూ ఎదుటివారి ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదులు చేశాయి. అయితే మేం చేసేదంతా బాగుంది.. ఎదుటివారిదే తప్పు అన్న భావన మంచిది కాదని చెప్పా. ఒకరి విషయాలను మరొకరు ఎత్తిచూపడం బదులు మొదట మన ఇల్లు మనం చూసుకోవాలి అని సూచించా.

- కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

నదీ జలాల పంపిణీలో అన్యాయం ఫలితమే తెలంగాణ ఉద్యమం. ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన నీటిని రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతాం. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని మేం అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆ రాష్ట్రం కొనసాగించడం బాధాకరం.

-సీఎం కేసీఆర్‌

కృష్ణా ట్రైబ్యునల్‌-2 కేటాయించిన నీటిని వాడుకునేందుకు పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ చెప్పింది. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి నీటిని తీసుకునేందుకు కొత్త పథకాలు నిర్మిస్తోంది. మేం ప్రస్తుత ప్రాజెక్టుకు అనుబంధంగానే రాయలసీమ ఎత్తిపోతల నిర్మిస్తున్నాం.

-ఏపీ సీఎం జగన్‌

సెక్షన్‌-3పై పట్టుబట్టిన కేసీఆర్‌

కృష్ణాజలాల కేటాయింపుపై అంతర రాష్ట్ర జల వివాద చట్టం 1956- సెక్షన్‌-3 ప్రకారం విచారణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ పట్టుబట్టారు. సమావేశంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ 2015లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఏపీ 512, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్‌ ఈ ఒప్పందం ఒక సంవత్సరానికేనని, ఏడేళ్లయినా దానినే కొనసాగిస్తున్నారని, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి తమ ఫిర్యాదును ట్రైబ్యునల్‌కు ఇవ్వాలని కోరారు. తాము సూచించిన అంశాలను ఎజెండాలో చేర్చలేదని, ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్లు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయం తీసుకొనే సమయం లేకనే ఎజెండాలో పెట్టలేదని కేంద్రమంత్రి సమాధానం ఇవ్వడంతో.. కృష్ణా బేసిన్‌లో ఉన్నా తెలంగాణకు ఎలా అన్యాయం జరుగుతుందో వివరించి ట్రైబ్యునల్‌కు అప్పగించాలని కోరారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని, వాటిని ఆపాలని కోరారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డితో సహా అన్ని ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని పేర్కొన్నారు.

విభేదించుకున్న ముఖ్యమంత్రులు

ఒకరు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడితే.. ఇంకొకరు కాళేశ్వరం ప్రస్తావన, పక్క బేసిన్‌కు నీటిని మళ్లించడం అక్రమమని ఒకరంటే.. కాదు ట్రైబ్యునలే చెప్పిందని మరొకరు.. ఇలా పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో విభేదించుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద కొత్త రిజర్వాయర్‌ కట్టడం లేదని, కొత్త ఆయకట్టు లేదని, అదనంగా నీటి వినియోగమూ లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేర్కొనగా.. అసలు పోతిరెడ్డిపాడు నిర్మాణమే అక్రమమని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. ‘జిల్లాకు 100 టీఎంసీలు నీళ్లొచ్చేలా చేద్దామన్నారు, ఇప్పుడు 50 టీఎంసీలు కూడా రానిచ్చేలా లేరే’ అని ఏపీ సీఎం అంటే, ‘వృథాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను వినియోగించుకోవాలని చెప్పానే తప్ప ఇలా కాదని’ తెలంగాణ సీఎం సమాధానమిచ్చినట్లు తెలిసింది. ‘కృష్ణా బేసిన్‌లో సాగుకు నీళ్లు లేకుండా పక్క బేసిన్‌కు నీళ్లు మళ్లించడాన్ని ఎలా అంగీకరిస్తామని’ తెలంగాణ ముఖ్యమంత్రి అంటే.. ‘ఇంకో బేసిన్‌కు మళ్లించవచ్చని బచావత్‌ ట్రైబ్యునలే పేర్కొందని’ ఆంధ్రప్రదేశ్‌ సీఎం అన్నట్లు సమాచారం. ఇలా పలు సందర్భాల్లో ఇద్దరూ విభేదించుకున్నట్లు తెలిసింది.

ఇదీచదవండి

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకి శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం: జగన్

Last Updated : Oct 7, 2020, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.