కరోనా వైరస్ నియంత్రణలో భారత్ ముందు ఉందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వలస కూలీల కోసం చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు మెదీ చేయూత అందించారని పేర్కొన్నారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికుల కోసం రూ.50 లక్షల బీమా కల్పించారన్నారు. భవన నిర్మాణ కార్మికుల నిధి వాడుకునేలా ఆదేశాలు ఇచ్చారని కన్నా గుర్తు చేశారు. ప్రపంచ చరిత్రలో ఇంత భారీ ప్యాకేజీ ఏ దేశం ప్రకటించలేదని కన్నా అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మెదీ అన్ని చర్యలు తీసుకున్నారన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వ స్పందన సరిగా లేదు
వలస కూలీల కోసం కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని కన్నా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేదన్నారు. భాజపా కార్యకర్తలే చాలాచోట్ల వలస కార్మికులకు సహాయం అందించారని తెలిపారు. కొన్నిచోట్ల కార్మికుల వద్ద అధికారులు డబ్బులు వసూలు చేశారని కన్నా ఆరోపించారు. ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగించాలని సీఎం జగన్కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భారతీయులకు భయం అక్కర్లేదు