ETV Bharat / city

'స్వర్గం చేస్తామని.. సంతోషం లేకుండా చేశారు' - భాజపా జనసేన పొత్తు

ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని స్వర్గం చేస్తామని చెప్పిన వైకాపా ఎవరూ సంతోషంగా లేకుండా చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని విమర్శించారు.

kanna laxminarayan comments on ysrcp govt

author img

By

Published : Feb 17, 2020, 5:41 PM IST

Updated : Feb 17, 2020, 7:48 PM IST

'స్వర్గం చేస్తామని.. సంతోషం లేకుండా చేశారు'

వైకాపా పాలనపై కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. పార్టీ పరంగా, హిందువులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహాలు పగలగొడుతున్నారని.. మతిస్థిమితం లేని వారు అలా చేస్తున్నారని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ వెన్యూ కన్వెన్షన్ హాలులో కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో వివిధ పార్లమంట్ నియోజకవర్గ నాయకులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 'ఇసుక విధానం అమోఘం అన్నారు. ఇప్పుడు వారి పార్టీ నేతలే దోచుకుంటున్నారు. మా పార్టీ నేతలు అడ్డుకుంటే... వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. రాజన్న పాలన ఇస్తామని రాక్షస పాలన చేస్తున్నారు.' అని కన్నా విమర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ దాడులు చేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.

హైకోర్టు కర్నూలులో ఉండాలన్నదే మా స్టాండ్

రాజధాని నిర్మాణ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న కన్నా.. ఆ నిర్ణయం ఎప్పుడో అయిపోయిందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చారని.. బాండ్లు కొన్నారని గుర్తు చేశారు. కేంద్రం గుర్తించి.. నిధులు విడుదల చేసిందని.. అహంకార పూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటే భాజపా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హైకోర్టు కర్నూలులో ఉండాలన్నదే తన స్టాండు అని.. అవినీతి కోసం, స్వార్థం కోసమే రాజధాని మారుస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

జనసేనతో కలిసే స్థానిక సంస్థల్లో పోటీ

'స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తాయి. భాజపా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కార్యకర్తలను ఉత్తేజపరిచేలా కార్యాచరణ రూపొందిస్తాం. ఇందుకోసం కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం. వివిధ ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటించి..ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక చేపడుతుంది. తర్వాత జిల్లాల వారీగా ఇన్​ఛార్జ్​లను నియమించి నిర్ణయం తీసుకుంటాం.' అని కన్నా స్పష్టం చేశారు.

కన్నాను కలిసిన ఐకాస మహిళా నేతలు

రాజధానికి మద్దతుగా ఉండాలంటూ అమరావతి పరిరక్షణ సమితి మహిళా విభాగం నేతలు భారతీయ జనతా పార్టీ నాయకులను కలిశారు. విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాలులో కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, మాణిక్యాలరావు, మాధవ్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే అమరావతికి భాజపా మద్దతు తెలిపిందని....భవిష్యత్తులోనూ ఉంటుందని కన్నా ఐకాస మహిళలకు తెలిపారు.

కన్నాను కలిసిన ఐకాస మహిళా నేతలు

ఇదీ చదవండి: 'కార్యదర్శిపై ఛైర్మన్​ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది'

Last Updated : Feb 17, 2020, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.