మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంధకారమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకట్రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఏడాదిగా రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
విభజనతో జీవచ్చవంలా ఉన్న రాష్ట్రానికి రైతులు భూములిచ్చి వెలకట్టలేని త్యాగం చేశారని కొనియాడారు. వ్యక్తిగత ద్వేషం, ధనదాహంతో ముఖ్యమంత్రి జగన్ అమరావతిని చంపేస్తున్నారని దుయ్యబట్టారు.