జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన సురేష్ బాబుపై చర్యలు తీసుకోకుండా చిన్న చిన్న తప్పులు చేసిన ఉద్యోగులను విధులనుంచి తొలగించడం అమానవీయమన్నారు. తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
పాలక మండలి నూతన ఈవోతో కలిసి ఆలయ అభివృద్ధి పనుల టెండర్లను ఇకనుంచైనా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆలయ ప్రతిష్ట పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమ్మవారి ఆలయానికి సంబంధించిన అన్ని టెండర్లు ఇక నుంచి ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో ఖరారు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: ఒడిశా ప్రభుత్వం ఆంక్షలతో.. సరిహద్దుల్లో ప్రారంభంకాని పోలింగ్