-
సోదరసోదరీమణులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan #Rakshabandhan#RakshaBandhan2021 pic.twitter.com/hQmDX0v8Ee
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">సోదరసోదరీమణులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan #Rakshabandhan#RakshaBandhan2021 pic.twitter.com/hQmDX0v8Ee
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2021సోదరసోదరీమణులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan #Rakshabandhan#RakshaBandhan2021 pic.twitter.com/hQmDX0v8Ee
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2021
జనసేన పార్టీ తరఫున సోదర సోదరీమణులందరికీ అధినేత పవన్ కల్యాణ్ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశమంటే మమతానురాగాలకు పుట్టినిల్లని, కుటుంబ జీవనానికి హరివిల్లని ఆయన వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వంతో విరాజిల్లే మనదేశం గురించి విన్నవారు.. కన్నవారు బాంధవ్యాలు చూసి అబ్బురపడుతూనే వుంటారన్నారు. భాందవ్యాలను విశ్వానికి చాటే వేడుకే 'రక్షాబంధన్'! శ్రావణ పౌర్ణమి నాడు భారతీయులంతా ఎంతో ఆత్మీయంగా జరుపుకొనే ఈ రాఖీ పండుగ సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు.
"దేశం బలంగా ఉండాలంటే కుటుంబాలు కూడా సమైక్యంగా ఉండాలని విశ్వసిస్తా. సమైక్యతను చాటి చెప్పే ఈ రాఖీ పండుగ అంటే భారతీయులందరితో పాటు నాకూ మక్కువే. ఇటీవల ఆడపడుచులపై జరుగుతున్న దురాగతాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. గుంటూరులో రమ్య హత్య , విజయనగరంలో రాములమ్మపై హత్యాయత్నం వంటి దుస్సంఘటనలు మనసును కలచి వేశాయి. తోడబుట్టిన వారే కాకుండా ఆడపిల్లలు అందరూ మన అక్కచెల్లెళ్ళే అనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. ఆడపడుచులు నిర్భయంగా మసలేలా భరోసా ఇవ్వడంతో పాటు వారికి రక్షణ కల్పించాలి. ఆడబిడ్డలపై పట్టపగలు నడిరోడ్డుపై జరుగుతున్న హత్యాచారాలు అడ్డుకోవాలి. అదే నిజమైన రక్షా బంధన్" - పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఇదీ చదవండి:
Viveka Murder Case: మరోసారి సీబీఐ ముందుకు రంగన్న.. భారీ భద్రత