ETV Bharat / city

JAGAN CASES: జగన్ కేసుల వాదనకు ప్రత్యేక న్యాయవాది ప్రతిపాదన: సీబీఐ - ys jagan news

జగన్ అక్రమాస్తుల కేసు కోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించే ప్రతిపాదన.. దిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఉందని సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. హైకోర్టులోని వాన్ పిక్ కేసు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

JAGAN CASES
JAGAN CASES
author img

By

Published : Nov 11, 2021, 8:57 PM IST

జగన్ అక్రమాస్తుల కేసుల కోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించే ప్రతిపాదన ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. ప్రత్యేక న్యాయవాది ప్రతిపాదన దిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఉందని సీబీఐ కోర్టుకు.. సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. రాంకీ ఫార్మా కేసులో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీబీఐ న్యాయవాది కోరారు. ఇందూ టెక్ జోన్ దర్యాప్తు స్థితి తెలపాలని.. ఆ తర్వాతే తన డిశ్చార్జ్ పిటిషన్​పై వాదనలు వినిపిస్తానన్న సీఎం జగన్ మెమోపై సీబీఐ స్పందించింది. ఇందూ టెక్ జోన్​లో దర్యాప్తు పూర్తయిందని.. మరో ఛార్జ్​షీట్ వేసే ఆలోచన లేదని సీబీఐ స్పష్టం చేసింది. సీబీఐ మెమోను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులను ఆదేశించింది.

వాన్ పిక్ కేసులో దర్యాప్తు స్థితి తెలపాలని విజయసాయిరెడ్డి మెమో దాఖలు చేశారు. అవసరమైతే అదనపు పత్రాలు, అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీబీఐ పేర్కొన్నందున.. దర్యాప్తు స్థితి తెలపాలని కోరారు. వాన్ పిక్ కేసులో దర్యాప్తు స్థితి ఈనెల 15న తెలపాలని సీబీఐని కోర్టు ఆదేశిచింది. జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. సబితా ఇంద్రారెడ్డి తదితరుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.

హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగింది. క్వాష్ పిటిషన్​పై కేవీ బ్రహ్మానందరెడ్డి వాదనలు ముగియడంతో.. వాన్ పిక్ ప్రాజెక్ట్స్, నిమ్మగడ్డ ప్రసాద్ క్వాష్ పిటిషన్ పై వాదనలు ప్రారంభమయ్యాయి. వాన్ పిక్ వ్యవహారంలో సీబీఐ అనేక అంశాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి ఛార్జ్ షీట్​లో ప్రస్తావించలేదని పేర్కొంది. మంత్రి మండలిని తప్పుదోవ పట్టించి ప్రాజెక్టు పొందినట్లయితే.. ఆ తర్వాత ప్రభుత్వాలు ఎందుకు రద్దు చేయలేదని.. తప్పుదోవ పట్టించిన అధికారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని వాన్ పిక్ తరఫు న్యాయవాది వాదించారు. తదుపరి విచారణను ఈనెల 15కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

DRUGS SEIZED: భారీగా డ్రగ్స్ పట్టివేత... ట్యాబ్లెట్ల రూపంలో.. ఫొటో ఫ్రేమ్స్​లో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.