వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో ముఖ్యమంత్రి జగన్ నెంబర్ వన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. తండ్రి హయాంలో తప్పుడు పనులు చేసి ఐఏఎస్‌లను జైలుకు పంపిస్తే... ఇప్పుడు ఐపీఎస్‌లను కోర్టు మెట్లు ఎక్కించి చీవాట్లు పెట్టిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినందుకు తెదేపా కార్యకర్తని 14 రోజులు రిమాండ్‌కి పంపారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెదేపా నాయకులపై హత్యాయత్నం చేసిన వైకాపా నాయకుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను ఇంత నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే.. ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతోందా అని కోర్టులు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: