తెలుగు రాష్ట్రాల్లో సోదాలపై ఆదాయపు పన్నుశాఖ ప్రకటన చేసింది. సుమారు రూ.2 వేల కోట్ల అవకతవకలను గుర్తించినట్లు పేర్కొంది. విజయవాడ, కడప, విశాఖ, దిల్లీ, పుణెల్లోని 40 ప్రాంతాల్లో సోదాలు చేశామని తెలిపింది. ఏపీ, తెలంగాణలోని 3 ఇన్‌ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులు గుర్తించామని వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయని ప్రకటించింది. లెక్కలు చూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల ఆభరణాలు లభ్యమైనట్లు వివరించింది. పలువురికి చెందిన 25కు పైగా బ్యాంకు లాకర్లను సోదాల్లో గుర్తించామని స్పష్టం చేసింది. ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీలు చేశామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
తెలుగురాష్ట్రాల్లో 2 వేల కోట్ల రూపాయలకి పైబడిన అక్రమ సంపాదనను.. ఆదాయ పన్నుశాఖ వెలికి తీసింది. కొద్ది రోజుల క్రితం ఏపీ, తెలంగాణలోని నగరాలతో సహా 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఈ మేరకు అక్రమార్జనను గుర్తించారు.