నేటి నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Vijayawada International Airport) విదేశీ సర్వీసులు పునః ప్రారంభం కానున్నాయి. గల్ఫ్ లోని మస్కట్, కువైట్.. సింగపూర్ ఇతర దేశాల నుంచి సర్వీసులు తరలిరానున్నాయి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి విదేశీ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపొయాయి. సాయంత్రం 6.10 గంటలకు 65 మంది ప్రవాసాంధ్రులతో దుబాయ్ సర్వీస్ చేరుకోనుంది.
వందే భారత్ మిషన్లో భాగంగా రానున్న విదేశీ సర్వీసులకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి.. ఆదివారం మినహా ఇతర రోజుల్లో వారానికి 10 విదేశీ సర్వీసులు రానున్నాయి. రానున్న అక్టోబర్ వరకు వందే భారత్ మిషన్లోని విదేశీ సర్వీసులు కొనసాగనున్నాయి. 18 దేశాల నుంచి ఇప్పటివరకు 496 ప్రత్యేక విమానాల్లో 56,038 మంది ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి చేరారు. అత్యధికంగా కువైట్ నుంచి 224 విమానాల్లో 29,356 మంది ప్రయాణికులు ఏపీకి చేరారని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
covid vaccination: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి టీకా పూర్తి!