Kavitha defamation case against BJP leaders: దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ దిల్లీకి చెందిన భాజపా ఎంపీ పర్వేశ్‌వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సాలపై తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఆమె మంగళవారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జి ముందు ఇంజంక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్సీ కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని ఎంపీ పర్వేశ్‌వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సాలను కోర్టు ఆదేశించింది. సభలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేయొద్దని పేర్కొంటూ పర్వేశ్‌వర్మ, మజుందర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 13కు వాయిదా వేసింది.
Mlc Kavitha on Delhi liquor scam: దిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నిరాధార అరోపణలు చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ కుమర్తెను బద్నాం చేస్తే.. కేసీఆర్ తగ్గుతారనుకుంటున్నారు.. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేది లేదని కవిత అన్నారు. ఆయణ్ని మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు.. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం.. ఎవరికీ భయపడేది లేదని ఆమె ధ్వజమెత్తారు. కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్‌ను తగ్గించడానికే భాజపా కుట్రం చేస్తోంది.. ఏ దర్యాప్తుకైనా మేం సిద్ధమే అని కవిత వ్యాఖ్యానించారు.
'ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేది లేదు. కేసీఆర్‌ను మానసికంగా వేధించాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం... ఎవరికీ భయపడేది లేదు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్‌ను తగ్గించడానికే భాజపా కుట్ర. కేసీఆర్ కుమార్తెను బద్నాం చేస్తే కేసీఆర్ తగ్గుతారనుకుంటున్నారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఏ దర్యాప్తునకైనా సిద్ధమే.. మాది పోరాటం చేసిన కుటుంబం'.-కవిత, ఎమ్మెల్సీ
భాజపా నేతలు విపక్షాలపై బట్టకాల్చి మీదేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలపై దుమ్మెత్తిపోసి తుడుచుకోమంటున్నారని మండిపడ్డారు. భాజపా ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. తమ కుటుంబంపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ బాటలోనే నడుస్తామని, ఎవరికీ భయపడం తేల్చి చెప్పారు.
ఇవీ చదవండి: