ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులను భయపెడుతోంది. అక్కడ వందల సంఖ్యలో పాజిటివ్ లక్షణాలతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన 1500 మంది భారతీయులు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. వీరిలో 300 మంది తెలుగు విద్యార్ధులూ ఉన్నారు. ఉక్రెయిన్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండడం.... వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్ధులకు లాక్‌డౌన్ కారణంగా సరైన ఆహారం లభించక అంతా అవస్థలు ఎదుర్కొంటున్నారు. భారత్కు తీసుకువచ్చి.. తామంతా ప్రత్యేకంగా స్వీయ రక్షణలో ఉండేందుకు అనువైన రీతిలో చర్యలు తీసుకునేలా చూడాల్సిందిగా ఇండియన్ ఎంబసీని కోరుతున్నారు. పట్టించుకోకపోతే.. కరోనా మహమ్మారికి బలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ చిట్కాలతో కరోనా లక్షణాల నుంచి ఉపశమనం!