Northern State Railway Tour: విహారయాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం భారతీయ రైల్వే, పైవెేటు భాగస్వామ్యంతో రైల్వే ప్యాకేజి ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే, ఉలా రైల్ భాగస్వామ్యంతో మహాలయ అమావాస్య దివ్య కాశీ యాత్ర పేరుతో రైలుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 22న ప్రారంభం కానుందని రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ వావిలాపల్లి రాంబాబు తెలిపారు. మధురై నుంచి ప్రారంభమై 12 రోజుల పాటు సాగుతుందని వివరించారు. ఈ యాత్రలో భాగంగా రైలు మదురైలో ప్రారంభమై దక్షిణ మధ్య రైల్వేలోని నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వరగంల్ రైల్వే స్టేషన్లలో అగనుందని తెలిపారు. ఇది కాశీ, గయా, అలహాబాద్, అయోధ్య, నైమిశారణ్యం, దిల్లీ, హరిద్వార్, ఆగ్రా వంటి ప్రముఖ స్థానాలకు వెళ్లనుందని వివరించారు.
యాత్రికులు ప్రముఖ ఆలయాలను ఈ యాత్రలో సందర్శించే వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. భారతదేశ అలయాలు, చారిత్రాత్మక కట్టడాలను, అటవీ ప్రాంతాలను ఈ యాత్ర ద్వారా వీక్షించవచ్చని ఆయన తెలిపారు. ప్రతి కోచ్‌లో సెక్యూరిటి సిబ్బందితో పాటు రెండు సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత పర్యవేక్షణ ఉంటుదన్నారు. దక్షిణాది ప్రజలకు, దక్షిణ రుచులనే అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని యాత్రికులు వినియోగించుకోవాలని కోరారు.
ఇందులో భారతీయులకే కాకుండా విదేశీయులకు అవకాశం ఉందని తెలిపారు. భారతదేశ శిల్పాకళను, జీవ వైవిధ్యాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను విదేశీయులకు చూపించడానికి దీనిని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సాధారణ రైళ్లలో ఉన్నట్లు కాకుండా.. ఇందులో సౌకర్యాలు విలాసవంతంగా ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి: