ETV Bharat / city

గృహ హింస బాధితురాలికి అండగా.. 'మహిళామిత్ర'

తోడుగా ఉండాల్సిన భర్త.. దాడి చేసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. లాక్ డౌన్ కారణంగా.. ఆ మహిళ ఎక్కడికీ వెళ్లలేక నరకయాతన అనుభవించింది. విషయాన్ని డీజీపీ సవాంగ్​కు చేరవేసేలా.. బాధితురాలిని పోలీసులు ఆదుకునేలా.. మహిళామిత్ర స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శ్రమించారు. బాధితురాలిని పోలీసులు ఆదుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

Police_Rescue_Victim_From_Domestic_Violance
గృహహింస బాధితులకు అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు
author img

By

Published : Apr 18, 2020, 12:10 PM IST

గృహహింస బాధితురాలికి అండగా 'మహిళామిత్ర'

విజయవాడకు చెందిన ఓ మహిళకు 11 ఏళ్ల కింద వివాహమైంది. కుటుంబంతో కలిసి చిత్తూరులో నివాసముంటోంది. తన భర్త చరవాణిలో అసభ్యకరమైన వీడియోలు ఉండటంపై నిలదీసింది. సహించలేని భర్త ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. భార్యాపిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఫోన్‌ ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి వెంటనే మహిళామిత్ర నిర్వాహకుల్ని సంప్రదించింది. స్వచ్ఛంద సంస్థ సాయంతో డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి విషయం చేరగా... ఆయన వెంటనే స్పందించారని బాధితురాలి తల్లి తెలిపింది.

లాక్ డౌన్ కారణంగా నేరుగా పోలీసులకు ఇలాంటి బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం లేనందున.. ఫోన్ ద్వారా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు కీర్తి చెప్పారు. అత్యవసరమైన కేసులను పోలీసులకు ఆన్ లైన్ మార్గంలో చేరవేస్తున్నామన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధిత మహిళలను రక్షించేందుకు దిశ అధికారులను సిద్ధం చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

ఇవీ చదవండి:

ఆహార ప్యాకెట్ల కోసం పరుగులు పెడుతున్న నిరుపేదలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.