ఫిబ్రవరి 5న ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మోహన్ డిమాండ్ చేశారు. జేఏసీ డిమాండ్లను తక్షణమే పరిష్కరించి సమ్మెకు వెళ్లకుండా చూడాలన్నారు. ఆర్టీసీలో అద్దె బస్సులు తగ్గించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను శాశ్వత పద్దతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని మానుకోవాలన్నారు. మే 23వ తేదీలోపు సమస్యలను పరిష్కరించకపోతే... జేఏసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇవి చదవండి...మోదీ, అమిత్‌షాపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు