అమరావతి ఉద్యమం అనేది బూటకమయితే వేలాదిగా పోలీసులను ఎందుకు పెట్టారో ప్రభుత్వ సలహాదారు సజ్జల సమాధానం చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా డిమాండ్ చేశారు. విశాఖ భూములు కొల్లగొట్టేందుకే ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో 15 నెలల్లో 72 వేల రిజిస్ట్రేషన్లు జరగటం నిజమైన ఇన్ సైడర్ ట్రేడింగ్ అని దుయ్యబట్టారు.
కేంద్రం పంపిన కందిపప్పు, బియ్యాన్ని ప్రభుత్వం మాయం చేసిందని ఆరోపించారు. 4 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతింటే రైతులను పట్టించుకోవట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంలో వేలాది కోట్ల ముడుపులు వసూలు చేసి.. అవినీతిని కప్పిపెట్టుకోవటానికే లోకేశ్‌పై సజ్జల నిందలు మోపుతున్నారుని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి: