ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రతిష్టా మంగైన్ను ఛత్తీస్గడ్ కేడర్‌కు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్‌కు చెందిన ప్రతిష్టా మంగైన్ ప్రస్తుతం నూజివీడు సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఛత్తీస్గడ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకుంటుండటంతో వ్యక్తిగత కారణాలరీత్యా ఆమె కేడర్ బదిలీకి అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఆమెను తక్షణం ఏపీ కేడర్ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీచదవండి
Supreme Court: ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రానిదే బాధ్యత: సుప్రీంకోర్టు