రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియా బాధ్యతలు చేపట్టారు. తొలుత గవర్నర్‌తో సమావేశమయ్యారు. అనంతరం రాజ్ భవన్‌లోని తన ఛాంబర్లో సంతకం చేశారు. అక్కడ ఉన్న అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించిన ఆయన.. రాజ్‌భవన్ అధికారులతో సమావేశమయ్యారు. రాజ్ భవన్‌కు సంబంధించి రాజ్యాంగ బద్దమైన ప్రతిష్ఠను ఇనుమడింపచేసేందుకు కృషిచేస్తానని సిసోడియా స్పష్టం చేశారు. సాధారణ ఉద్యోగి మొదలు.. ఉన్నతస్దాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేయడంతో మంచి ఫలితాలు సాధించగలమన్నారు. 1991 బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన సిసోడియా.. ప్రభుత్వం ఇటీవల జరిపిన సాధారణ బదిలీల్లో భాగంగా రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కమీషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పలు శాఖల్లో విశేషగుర్తింపు..
రాజస్థాన్‌కు చెందిన సిసోడియా.. జంతు శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ అనంతరం అఖిల భారత సర్వీస్‌కు ఎంపికయ్యారు. సమైఖ్య రాష్టంలో హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, తదితర విభాగాల్లో పనిచేశారు. ఉద్యానవన శాఖ కమిషనర్, మానవ వనరుల అభివృద్ది సంస్థ సంచాలకులుగా విశేష గుర్తింపుపొందారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన.. అనంతరం సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య రాజకీయ కార్యదర్శిగా ప్రధాన భూమిక పోషించారు. మరో వైపు కేంద్ర సర్వీస్‌లో సైతం క్రియా శీలకంగా వ్యవహరించిన సిసోడియా.. కేంద్ర ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శిగా పలు సంస్కరణలకు శ్రీకారంచుట్టారు.
ఇదీ చదవండి..
FOOD POISON: బల్లి పడిన ఆహారం తిని 27 మంది విద్యార్థులకు అస్వస్థత