ఒడిశాతో పాటు వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ద్రోణి కూడా ఆవరించి ఉన్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. రాగల 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ లోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగానే వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని స్పష్టం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.
ఇదీచదవండి.