గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6,582 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 9,62,037 కు చేరింది. మరణాల సంఖ్య 7,410కి పెరిగింది. కరోనా నుంచి 2,343 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 9,09,941 కు ఎగబాకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,686 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 35,922 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు...
చిత్తూరు జిల్లాలో 1,171, శ్రీకాకుళం జిల్లాలో 912, గుంటూరు జిల్లాలో 804, కర్నూలు జిల్లాలో 729, నెల్లూరు జిల్లాలో 597, విశాఖ జిల్లాలో 551, కృష్ణాలో 465, విజయనగరం జిల్లాలో 349, ప్రకాశం జిల్లాలో 314, అనంతపురం జిల్లాలో 305, కడప జిల్లాలో 203, తూర్పుగోదావరి జిల్లాలో 100, పశ్చిమగోదావరి జిల్లాలో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా కరోనా మృతులు...
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మృత్యువాతపడగా... కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున మరణించారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖ, విజయనగరంలో ఒక్కొక్కరు మృతి చెందారు.
ఇవీచదవండి.