గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,535 కరోనా కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి 2,075 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా మృతులు...
కొవిడ్ వల్ల చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఒకరు, వైఎస్ఆర్ కడపలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు...
తూర్పుగోదావరిలో 299, చిత్తూరులో 237, నెల్లూరులో 211, పశ్చిమగోదావరిలో 177, గుంటూరులో 173, కృష్ణాలో 109, ప్రకాశంలో 107, విశాఖపట్నంలో 65, శ్రీకాకుళంలో 54, కడపలో 39, అనంతపురంలో 31, విజయనగరంలో 25, కర్నూలులో 8 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:
Flag Hosting: జిల్లాల్లో పతాకావిష్కరణ చేసే మంత్రుల పేర్ల జాబితాలో మార్పులు