రాష్ట్రంలో కోటిన్నర మంది దిశ యాప్ వాడుతున్నారని.. దిశా యాప్ ద్వారా 900 మందిని రక్షించామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. దిశా యాప్‌ను మరింతగా అభివృద్ధి చేస్తున్నట్లు హోంమంత్రి చెప్పారు. రమ్య హత్య కేసులో 10 నెలల్లో తీర్పు వచ్చేలా కృషి చేశామని.. బాధిత కుటుంబానికి రూ.కోటి విలువైన 5 ఎకరాల భూమి ఇచ్చామన్నారు. విజయవాడ ఘటనలోనూ తల్లిదండ్రుల ఫిర్యాదుతో తక్షణమే స్పందించి పోలీసులు చర్యలు చేపట్టారన్నారు.
విశాఖ మన్యంలో గంజాయి సాగు ఇవాళ్టిది కాదని.. అయినప్పటికీ ఆ సాగు నివారణకు చర్యలు చేపట్టామన్నారు. గంజాయి పండించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని హోంమంత్రి చెప్పారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను హోంమంత్రి ఖండించారు. తెలంగాణలాగా డ్రగ్స్ వినియోగం, పబ్ కల్చర్ ఏపీలో లేదని.. దిశ ఘటన జరిగిన తెలంగాణలోనూ దిశ లాంటి చట్టం లేదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: