NBK Ugadi Wishes : తెలుగు ప్రజలకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగువారి తొలి పండుగని.. షడ్రుచుల సంగమమే జీవితమని తెలిపే పండుగ అని అన్నారు. ఒకటి మధురం, రెండు పులుపు, మూడు లవణము, నాలుగు కారం, ఐదు చేదు, ఆరు వగరు ఈ షడ్రుచులు కలిసిందే మన జీవితమని తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందాలు చిగురించాలని, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు బాలయ్య పేర్కొన్నారు.
ఇదీ చదవండి : 'ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక'