స్వల్ప అస్వస్థతో తెలంగాణలోని హైదరాబాద్ హైదర్‌గూడ అపోలో ఆసుపత్రిలో చేరిన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. సాధారణ వైద్యపరీక్షల కోసమే ఆసుపత్రికి వచ్చినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. లక్ష్మణ్‌తో పాటు తెదేపా నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు దత్తాత్రేయను పరామర్శించారు.
ఇదీ చూడండి: అపోలో ఆస్పత్రిలో చేరిన దత్తాత్రేయ