ETV Bharat / city

Regularizations: సరిహద్దులు లేకుండా ఇళ్ల పట్టాలు.. క్రమబద్ధీకరణ కోసం డబ్బులు డిమాండ్

Regularization of houses: విజయవాడ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలయ్యాయి. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాల రిజిస్ట్రేషన్లు ఈసారి తప్పకుండా ఇస్తామన్న నేతలు.. ఆ తర్వాత ఆవైపు ముఖం చూపలేదు. ఇంటి సరహుద్దులు లేకుండా కొంతమందికి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు క్రమబద్దీకరణకు సొమ్ములు అడగటంపై మండిపడుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 7, 2022, 11:54 AM IST

House regularizations in Vijayawada : విజయవాడ నగరంలో అద్దెలు కట్టలేని పేదలు, మధ్యతరగతి ప్రజలు కొండలపైనే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు. ఏళ్లతరబడి అక్కడే ఉంటూ ఇప్పుడు పక్కా గృహాలు సైతం నిర్మించుకున్నారు. ఇలా దాదాపు 2 లక్షల మంది కొండలపైనే ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ముఖ్యంగా మొగల్‌రాజపురం, గుణదల, వన్‌టౌన్, చిట్టినగర్ ప్రాంతాల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నివాసాలు కట్టుకుని ఉంటున్నా.. ఆ స్థలంపై వారికి ఎలాంటి హక్కులు లేవు. ఈ స్థలాలు క్రమబద్దీకరించాలని ఏళ్లుగా వారు వేడుకుంటున్నారు.

నగరపాలక ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు హామీలు గుప్పించారు. తప్పకుండా స్థలాలు క్రమబద్దీకరిస్తామని ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావొస్తున్నా.. ఇప్పటికీ వారికిచ్చిన హామీపై కదలిక లేదు. దీనిపై విపక్ష సభ్యులు కౌన్సిల్ సమావేశంలో పట్టుబట్టడంతో.. కంటితుడుపు చర్యగా లబ్దిదారుల పేరుతో ఇంటి పట్టాలను మంజూరు చేశారు.

ఇళ్ల క్రమబద్దీకరణ చేసుకోవాలంటే 5 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్

సాధారణంగా ఇంటిని క్రమబద్దీకరణ చేస్తే ఇంటి యజమాని పేరుతో పాటు సరిహద్దులను పట్టాలో నమోదు చేస్తారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలో యజమాని పేరు తప్ప.. ఇతర వివరాలు లేకపోవడం లబ్దిదారులకు పలు అనుమానాలను కలిగిస్తోంది. ఇళ్ల క్రమబద్దీకరణ చేసుకోవాలంటే 5 వేల రూపాయలు చెల్లించాలనడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్ధిక పరిస్థితే బాగుంటే కొండలపై ఎందుకు నివాసం ఉంటామని వారు ప్రశ్నిస్తున్నారు. సొంత ఇళ్లు లేకపోవడంతో అవసరాల కోసం ఎక్కడా అప్పు దొరకడం లేదని వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.