ETV Bharat / city

పీఏసీఎస్​ల కాలపరిమితిపై నిర్ణయాధికారం ప్రభుత్వానిదే...

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలకవర్గాల కాలపరిమితి విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని తెలిపింది.

పీఏసీఎస్​ పాలకవర్గల కాలపరిమితిపై హైకోర్టు జోక్యం చేసుకోదు
author img

By

Published : Aug 1, 2019, 11:24 AM IST

పీఏసీఎస్​ పాలకవర్గల కాలపరిమితిపై హైకోర్టు జోక్యం చేసుకోదు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లకు చెందిన పాలక వర్గాల కాలపరిమితిని పెంచకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం సర్కారుకు ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఎన్నికలు నిర్వహించేంత వరకు తమ పాలకవర్గాన్ని కొనసాగించే విధంగా ఆదేశాలు జారీచేయాలన్న కృష్ణా జిల్లాకు చెందిన శ్రీరాంపురం పటేల్, పీఏసీఎస్ అధ్యక్షురాలు లక్ష్మినర్సమ్మ దాఖలు చేసిన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.

పిటిషనర్​ తరపు వాదన
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సర్కారు పీఏసీఎస్​ల కాలపరిమితిని పెంచకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ సభ్యులకు పీఏసీఎస్​ల కార్యకలాపాలేవి తెలియవన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేంత వరకు పాలకమండలి కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.

సర్కారు తరపు వాదన
సర్కారు తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. పీఏసీఎస్​లు ఆర్థిక బలోపేతం సాధించే దిశగా సర్కారు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 40 శాతం పీఏసీఎస్​లు నష్టాల్లో ఉన్నాయని, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లోపాల్ని సవరించి సరైన మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నామని చెప్పారు. అందులో భాగంగా పీఏసీఎస్ కాల పరిమితిని పొడిగించకూడదనే విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు.

తీర్పు
వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులివ్వడానికి నిరాకరించారు.

ఇదీ చదవండి :

ఇజ్రాయిల్ పర్యటనకు సీఎం జగన్

Intro:AP_GNT_43_31_KONA_SAMIKSHA_SAMAVESAM_AVB_AP10026.
FROM...NARASIMHARAO,CONTRIBUTOR,BAPATLA,GUNTUR,DIST.
కీట్ నెంబర్ 676
బాపట్ల మానవ వనరుల అభివృద్ధి కేంద్రం లో సమీక్ష సమావేశానికి తరలివచ్చిన జిల్లా అధికారులు బాపట్ల నియోజకవర్గ పరిధిలోని బాపట్ల పట్టణం ,బాపట్ల , కర్లపాలెం ,పిట్టలవానిపాలెం మండలాల అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం ఉప సభాపతి కోన రఘుపతి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇలాంటి సమావేశం నియోజకవర్గంలో నిర్వహించటం దాదాపుగా ఇదే ప్రథమం. బాపట్ల నియోజకవర్గం లోని పట్టణము మండలంలో ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం చూపేందుకు రాబోవు ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో ప్రణాళికను సిద్ధం చేసేందుకు జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని గత 16 సంవత్సరాలలో నియోజకవర్గంలో ని 50 వేల గృహాలను ఇంటింటికి ఆరు నుంచి ఏడు సార్లు సందర్శించానని పూర్తిస్థాయిలో నియోజకవర్గంపై అవగాహన ఉందని ఉపసభాపతి కోన రఘుపతి తెలియజేశారు. బైట్...... కోన రఘుపతి శాసనసభ ఉపసభాపతి
Body:బాపట్ల Conclusion:గుంటూరు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.