రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పరీక్షా ఫలితాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ విషయమై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఫలితాల కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక విద్యాబోధన ప్రాజెక్టు, విద్యా కానుక అమలు అంశాలపైనా సమావేశంలో చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం క్యాలెండర్ తయారీ, పాఠశాలలు తెరిచే అంశంపైనా సమీక్ష నిర్వహించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రాథమిక విద్యాబోధన, విద్యాకానుక అమలుపై ఉన్నతాధికారులతో మంత్రి సురేశ్ చర్చించారు.
ఇదీ చదవండి
Exams Cancelled: పది, ఇంటర్ పరీక్షలు రద్దు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం