కరోనా నేపథ్యంలో బక్రీద్ ప్రార్థనల విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని హైకోర్టు సమర్థించింది. మతవిశ్వాసాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. తిరుమలలో సైతం ఆంక్షలు విధించాలని గుర్తుచేసింది. బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాలు, మసీదుల్లో ఎక్కువ మంది ప్రజలు ఒకచోట చేరకుండా ఉండేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మసీదుల్లో 50మందికి మించి ప్రార్థనల్లో పాల్గొనడానికి వీల్లేదని తెలిపింది. ఈ జీవోను సవాల్ చేస్తూ నెల్లూరుకు చెందిన న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా.....ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
ఇదీ చదవండి: