ETV Bharat / city

High Court: టారిఫ్​లను సమీక్షించే అధికారం ఈఆర్​సీకి ఉంది: ఏజీ - aperc

విద్యుత్ టారిఫ్​లను పునఃసమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థల తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు సింగిల్ జడ్జి సైతం సమీక్ష వ్యవహారం ఏపీఈఆర్​సీకి వదిలేశారన్నారు.

High Court
ఈఆర్​సీ
author img

By

Published : Aug 17, 2021, 3:24 AM IST

విద్యుత్ యూనిట్ టారిఫ్ ధరలను పునఃసమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థల తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు సింగిల్ జడ్జి సైతం సమీక్ష వ్యవహారం ఏపీఈఆర్​సీకి వదిలేశారన్నారు. పూర్తిస్థాయి వాదనలకు సమయం లేకపోవడంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని యూనిట్ టారిఫ్ ధరలను ఏపీఈఆర్​సీ సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. తాజాగా విచారణలో డిస్కంల తరఫున పేజీ వాదనలు వినిపించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.