ETV Bharat / city

HIGH COURT ON SEC: గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవం ఉందా..?: హైకోర్టు - high court say not interfere in universities

గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవం ఉందా అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(sec) నీలం సాహ్ని తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. నీలం సాహ్ని ఎస్ఈసీగా నియమించడాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది.

HIGH COURT ON SEC
ఎస్​ఈసీ నీలం సాహ్ని
author img

By

Published : Aug 5, 2021, 2:56 AM IST

ఐఏఎస్​గా పనిచేసిన కాలంలో ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవం ఉందా ? అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(sec) నీలం సాహ్ని తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్ఈ​సీ నియామకం కోసం గవర్నర్‌కు ముఖ్యమంత్రి సిఫారసు చేసిన మూడు పేర్లలో నిర్దిష్ట వయసు, అర్హత ఉన్న వారినే పంపారా ? లేదా ? ఆరా తీసింది. తాజాగా(బుధవారం) జరిగిన విచారణలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి తరపు వివేక్ చంద్రశేఖర్, నీలం సాహ్ని తరపు పీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. ప్రతివాదుల వాదనలకు తిరుగు సమాధానంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించేందుకు విచారణ ఈ నెల 9కి వాయిదా వేస్తూ... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

నీలం సాహ్ని ఎస్ఈసీ(sec neelam sahni)గా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​ బుధవారం విచారణకు వచ్చింది. ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమెకు ఎన్నికల విధులను నిర్వహించిన అనుభవం ఉందన్నారు. మరోవైపు న్యాయమూర్తి లేవనెత్తిన పలు ప్రశ్నలకు గవర్నర్ ముఖ్యకార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

విశ్వవిద్యాలయాల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎంబీబీఎస్(MBBS) మొదటి ఏడాదిలో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు.. రెండో సంవత్సరంలో తరగతులకు అనుమతించేలా ఆదేశించాలని చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. వారు వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది. వైద్య రంగం ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నందున విశ్వవిద్యాలయ నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం పేర్కొంది. ప్రధాన వ్యాజ్యాల్లో కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

కొవిడ్ కారణంగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేదని 114 మంది వైద్య విద్యార్థులు.. రెండో ఏడాదిలో తరగతులకు అనుమతిచ్చేలా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, జాతీయ వైద్య మండలిని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మొదటి ఏడాదిలో ఫెయిల్​ అయిన సబ్జెక్టులను రెండో ఏడాదిలో రాసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ అభ్యర్థనను తిరస్కతిస్తూ.. జాతీయ వైద్య మండలి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

ఇదీ చదవండి..

రాజధాని గ్రామాల పరిస్థితిపై వివరాలు సమర్పించండి: హైకోర్టు

High court: విచారణకు హాజరుకాని అధికారులపై హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.