Tollywood drugs Case: తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వాలని పలుమార్లు ఎక్సైజ్ శాఖను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈడీ.. హైకోర్టును ఆశ్రయించింది.
ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిగిన వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఈడీ... సీఎస్, ఎక్సైజ్ డైరెక్టర్‌కు కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని కోరింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు... తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: