జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకపోవడంపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ఈ గెజిట్‌లో జీవోలపై ఉత్తర్వులు జారీచేసినట్లు పిటిషనర్ తెలిపారు. జీవోఐఆర్‌లో కాకుండా ఏపీ ఈ గెజిట్‌లో జీవోలు ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పూర్తి వివరాల సమర్పణకు ప్రభుత్వ తరఫు న్యాయవాది సమయం కోరారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీచదవండి.