విజయవాడలో 'హెల్పింగ్ హ్యాండ్స్' అనే స్వచ్ఛంద సంస్థ లాక్డౌన్ నేపథ్యంలో రోజు కూలీలు, అనాథలు, రవాణా సౌకర్యం లేక చిక్కుకున్న వారి ఆకలి తీరుస్తోంది. రోజుకు మూడు వేల ఆహార పొట్లాలు పంచుతున్నారు. లాక్డౌన్ తొలగించే వరకు ఈ కార్యక్రమం చేపడతామని నిర్వాహకులు వెల్లడించారు. జైన్ సమాజంలో 20 ఎన్జీఓ గ్రూప్లు కలిసి ఈ సేవా కార్యక్రమం చేపట్టాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు