విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా రైళ్ల రాకపోకలు ప్రారంభమవటంతో రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా కిటకిటలాడింది. స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ప్లాట్ఫాం మీద ప్రయాణికులు ఎక్కువ మంది చేరడం వల్ల భౌతిక దూరం పాటించడం కష్టమైంది. వీరిని నియంత్రించేందుకు అధికారులకు సాధ్యపడలేదు. రైలు వచ్చినపుడు స్వల్ప తోపులాట జరిగింది. రైలు టికెట్ కొన్న వారిని మాత్రమే అధికారులు ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేసి, మాస్కులు ఉన్నవారినే లోపలికి పంపారు. ప్రయాణికుల తాకిడి పెరగటంతో రైల్వేస్టేషన్లో పోలీసు సిబ్బందిని పెంచారు.
ఇదీ చదవండి :