- హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం
- హుస్సేన్‌సాగర్ నిండిపోయి పొంగిపొర్లుతున్న వరద
- భారీ వరద వల్ల ట్యాంక్‌బండ్ దిగువన ఉన్న ప్రజల్లో భయాందోళన
- హుస్సేన్‌సాగర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు
- హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతవాసులను అప్రమత్తం చేసిన అధికారులు
అంబర్‌పేటలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ పర్యటన
- హైదరాబాద్: అంబర్‌పేటలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ పర్యటన
- రామంతాపూర్ చెరువు, హబ్సిగూడ ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు
- బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్
- సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్పొరేటర్లను సూచించిన ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి
జంట జలాశయాల్లోకి భారీగా వరద
- హైదరాబాద్: జంట జలాశయాల్లోకి భారీగా వరద
- హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 19,100 క్యూసెక్కులు
- హిమాయత్‌సాగర్ 11 గేట్లు ఎత్తి 22 వేల క్యూసెక్కులు మూసీలోకి విడుదల
- హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుతం 1762. 86 అడుగుల నీటిమట్టం ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం
- హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 20,833 క్యూసెక్కులు
- ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1779. 50 అడుగుల నీటిమట్టం
నీట మునిగిన పురాతన శివాలయం
- హైదరాబాద్: చైతన్యపురిలో నీట మునిగిన పురాతన శివాలయం
- చైతన్యపురిలో నీటమునిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం
- రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన ఆలయాలు
రహదారిపై భారీగా చేరిన వరద నీరు
- హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరు
- భారీగా వరద నీరు చేరికతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం
- వరద నీరు వల్ల కరీంనగర్ నుంచి పేషెంట్‌ను తీసుకొస్తున్న అంబులెన్స్ నిలిపివేత
- అంబులెన్సు అక్కడే నిలిపి స్ట్రెచర్‌పై పేషంట్‌ను కొత్తపేట ఓమ్ని ఆసుపత్రికి తరలింపు
వరద ప్రవాహం
- సికింద్రాబాద్: బోయిన్‌పల్లి పరిధిలో వరద ప్రవాహం
- సీతారాంపురం, సౌజన్యకాలనీల్లోకి చేరిన వరద ప్రవాహం
- వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పలు వాహనాలు
మంత్రి కేటీఆర్ పర్యటన
- ఎల్‌బీనగర్ బైరామల్‌గూడలో మంత్రి కేటీఆర్ పర్యటన
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేటీఆర్
- హోంమంత్రి, సీఎస్, డీజీపీతో కలిసి బైరామల్‌గూడలో పర్యటన
- వరద ప్రాంతాల్లోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్న కేటీఆర్
- నీరు త్వరగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
- ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు సూచనలు చేసిన కేటీఆర్
- బైరామల్‌గూడ కాలనీ సమస్యలపై ప్రజలతో మాట్లాడిన కేటీఆర్
- తమ సమస్యలను మంత్రి కేటీఆర్‌కు వివరిస్తున్న ప్రజలు
- శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి కేటీఆర్‌ను కోరిన స్థానికులు
- ముంపునకు గురైన ఓ నివాసంలోకి వెళ్లి బాధితులను పరిశీలించిన కేటీఆర్
- నిజాంపేట్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కూలిన గోడ
- 30 అడుగుల గోడ కూలి పక్కన ఉన్న భవనాలపై పడిన పెచ్చులు
- పక్కన ఉన్న భవనంలో 2 ప్లాట్లు, రెండు కార్లు ద్విచక్రవాహనాలు ధ్వంసం